http://www.zahradnizidle.cz/?st=maps2 Unfortunately this project hasn't been funded on time!
VEN_3695

get link Funds required for construction and renovation of Sri Balaji Venkateswara Temple.

top term paper proofreading services for school write my essay for me cheap uk Address: Sri Balaji Venkateswara Temple, Injapur, Hayath nagar, R.R District

http://www.bygrabowicz.pl/?p=esl-literature-review-sady-928 శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరియు చంద్రమౌళిశ్వర స్వామి దేవాలయం :

get link శ్రీ బాలగోని వెంకయ్య 16 వ శతాబ్దం లో ఈ ఆలయాల నిర్మాణమునకు శంకుస్థాపన చేసియుండిరి.వారి తదనంతరం వారి మనుమడు అయిన వెంకట నర్సయ్య చౌదరి గారు నిర్మాణ పనులని పూర్తి గావించిరి.

professional thesis proposal proofreading site for masters ఆధారం :

literature review purdue 16 వ శతాబ్దం ఆదిలోనే హైదరాబాద్ నగరంలో చార్మినార్ కట్టడం నిర్మాణం జరిగినది.ఈ నిర్మాణం స్వచ్చమైన డంగు సున్నం తో నిర్మించబడినది.ఇదే రీతి గా సున్నం ఉపయోగించి ఈ దేవస్తానకట్టడం జరిగినది.ఈ నిర్మాణము యొక్క సున్నపు కట్టడము ఆలయ గోపుర మందు ఈ నాటికి చెక్కు చెదరకుండా కనిపించుచున్నది.కావున ఈ ఆలయ నిర్మాణం 16 వ శతాబ్దం లో ఉపయోగించబడిన నిర్మాణ సామాగ్రి తో నిర్మితమైనది అని నిరూపణ జరిగినది.

http://www.maqtra.com/?p=spontaneous-remission-of-xyha-831 ఆగమ వాస్తు శాస్త్రం ననుసరించి ఇంజాపురం గ్రామానికి (ఈశాన్యం) నందు ఆలయ నిర్మాణము జరిగినది.

http://www.framllc.com/?p=popular-thesis-proposal-pyh-828 ఈ గ్రామం యొక్క పేరు పూర్వం ఇనుజాపురం అని పిలువబడేది.కాలక్రమేనా ఇది ఇంజపురులుగా వ్యవహరించబదుచున్నధి.ఇనుజులు అనగా దేవతకు వర్తింతురు.పూర్వికులలో వంశవృక్ష పురుషుడైన బాలగొని రామస్వామి (ఇతని కుమారులు పాపయ్య,వెంకయ్యలు) కి దైవచింతన ఆధ్యాత్మిక అనుకరణ సహజ సిద్ధముగా అవడినవని ప్రతీతి.ఇతని పొలాలొ ఆవాసం ఉండుట చే ఒకనాటి రాత్రి అతనికి ధవళ వస్త్రదారులైన ఇనుజులు కనిపించి ఇది ఇనుజ ఆవాసము -మనుజుల ఆవాసము కాదు ఇక్కడ నీవు ఆలయ నిర్మాణము సకల దేవతానుగ్రహ ప్రాప్తికి అనువుగా నిర్మించవలసింధిగా స్వప్నము లో కోరినట్లుగా వారి కుమారులైన వెంకయ్య చౌదరి గారు మరియు పాపయ్య చౌదరి గార్లు తమ తండ్రి ఈ విషయాన్నీ తెలుసుకున్నా ఇక్కడ మత సామరస్యాన్ని కాపాడుటకు అనువుగా (16వ శతాబ్దము లో వైష్ణవ,శైవ మత విబేధము ప్రజ్వరిల్లి ఉండేది).వైష్ణవ మరియు శైవ సంప్రదాయాలు అనుగుణంగా బాజి ఆలయము మరియు శివాలయ నిర్మాణమునకు శంకుస్థాపన గావించిరి.ఇక్కడ దేవతల అనుగ్రహ ప్రాప్తి కి యజ్ఞ యాగాది క్రతువులు ఆయా మాసములలో నిర్వహించబడేవి.వీటికి ఆధారం ఈ స్థలాన్ని పరిశీలించినప్పుడు ఈ ఆలయానికి ఉత్తర ఈశాన్య భాగములలో చతురస్రాకారము లో గల శిధిలావస్థ లో ఉన్న వేదికలు వాటి చుట్టూ కట్టబడిన ఇటుక ప్రహారీలు సాక్షమిచ్చుచున్నది.ఇటుక వైశాల్యం ఒక్కొక్కటి 2 అడుగుల పొడవు 8 అంగుళాల వెడల్పు తో అక్కడక్కడ ఇప్పటికి దృగ్గోచర…మరొక ఉత్పత్యర్ధము ననుసరించి ఈ ఊరు పేరు అయిన ఇనుజ అనగా సుర్యిని యొక్క కుమార్తె అనగా స్వాతి దేవతకు వర్తించును.

అందువలన ఈ గ్రామానికి ఉత్తర భాగములలో ఉన్న ఆలయాల ప్రశస్థనము గురించి మరియు ఉత్పత్యర్ధం దృష్ట్యా ఇనుజాపురం అని స్థిరనామదేయము ఏర్పడినది.కావున ఆ ఆలయాల పరిధి లో మనుజ ఆవాసము(కుటుంభ పూర్వీకుల శిధిలమైన ఇండ్లు తప్ప) లు లేవు.ఇనుజుల ఆవాసముగా పేరుపొంది కాలానుగుణంగా నిర్వహింపబడిన ప్రశస్తము వలన ఈ గ్రామానికి ఇనుజపురం అనునామము సార్ధకమైనధి.కాల గర్బం లో అనుక్రమణ నానుడి లో ఇనుజపురం ఇంజపురము గా మారినది.

కళాత్మక విశేషాలు :

ఉపయోగించబడిన పంచలొహముల తొడుగుల యొక్క పరిశీలిన వలన (గాలి గొపురమునకు ఉన్న తొడుగు) ఈ నాటికి మెరుగు లో వన్నె తగ్గకపోవడం అనే అంశము వాడబడిన లోహ ప్రాశిస్త్యాన్ని ప్రస్పుటింపజేయుచున్నది.సాధారణముగా పంచాలోహపు విగ్రహాలు కాని తొడుగులు కాని ప్రతి నిత్యము శుబ్రపరిచనప్పుడు వానిలో తళుకు బహిర్గతం కాదు.కాని ఏ శుబ్రత లేకుండా 16 శతాబ్దం నుండి గాలి గోపురం లో కనిపించుచున్న మెరుగైన తళుకు ఆ నాటి కాలం లో వాడబడిన లోహ మిశ్రమానికి తార్కాణము.

వెంకటేశ్వర దేవాలయం మరియు ద్వజస్థంబము :

ఏక శిలా నిర్మాణము కలిగి ఉండి పైన గల గరుడ విగ్రహపు చెక్కడము చెప్పి చెప్పకనే తిరుమల తిరుపతి దేవస్థానము లోని గరుడ స్థంభ నిర్మాణము తలపింపజేయుచున్నది.ఆలయం లోని ప్రాకార కుడ్యము మెట్లు,గర్భగుడి ఆనతి శిల్ప ప్రాశిస్త్యాన్ని ప్రస్పుటము చేయుచున్నది.ఆలయ గోపుర నిర్మాణము పూర్తిగా రాతి స్థంబాలతో సున్నపు పూత చే నిర్మింపబడి నాలుగు వందల సంవత్సరాల పూర్వము చార్మినార్ కట్టడానికి ఉపయోగించిన సున్నాన్ని తలపింపజేయుచున్నది.ఇందుకు కారణం ఈ నాటి వరకు గోపురం యొక్క కట్టడంలోని ఏ బాగము కూడా మచ్చుకైనాను నాచు,నీరు ఇతర మలినాలు కనిపించకుండా యదా విధిగా గోచరించు చున్నది.త్రిగునాత్మకతకు ప్రతిగగా అన్నట్లు ఈ ఆలయం లో వేరుగా అమ్మవారి అంతర ఆలయము లేకుండా మూలవరులు ఒకే అంతర ఆలయము లో శ్రీ దేవి,భూ దేవి,వెంకటేశ్వరులు మాత్రమే ఉన్నవి.వీరికి సాదృశ్యము గా ఈ ఆలయానికి 3 ద్వారములు మాత్రమే నిర్మింపబడినవి.ముఖ ద్వారము దాదాపు 16 అడుగులు ఒక్కక్క తలుపు 4 అడుగుల వెడల్పు తో చెక్కపై ఇనుప తొడుగులతో నిర్మింప బడినది.ఇవి ఆ నాటి మానవ నిర్మానత్మకతకు నిదర్శనము.

వెంకటేశ్వర స్వామి మరియు అమ్మవార్లు ఇక్కడ తూర్పు దిశగా దర్శనమిస్తారు.స్వామి వారి గర్బగుడి ద్వారం ముందు జయ విజయ లు తూర్పు దిశగా మరియు ఎదురుగా పశ్చిమ దిశగా గరుత్మంతుడు,హనుమంతుడు దర్శనమిస్తారు.వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పశ్చిమ దిశగా ద్వారపాలకుడి గా ఆంజనేయ స్వామి చూడ వచ్చు(సాదరంగా హనుమంతుడు దక్షిణము దిశ గానే దర్శనమిస్తారు).ఇక్కడ ఆంజనేయుడి పాదాల కింద శనిమః దేవుడు దర్శనమిస్తారు.దేశం లోనే ఇదొక అరుదైన విగ్రహం గా చెప్పుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి దేవాలయం లోని సున్నం కొట్టు లో వందల సంవత్సరాల పాము (నాగరాజు) ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు.కానీ నాగరాజు యొక్క దర్శనం చేసుకున్న వాళ్ళు చాల అరుదు.వెంకటేశ్వర స్వామి దేవాలయమునకు ఈశాన్య భాగము లో ఒక పెద్ద రధం ఉండేది.ఈ రధం దాదాపు వెంకటేశ్వర స్వామి గర్బగుడి ఎత్తు ఉండేది.కానీ ఇప్పుడు అది కాలగార్బం లో కలిసి పోయింది.

శివాలయం :

ఇక్కడ శివాలయము లో గల పాన పట్టము మరియు శివ లింగము కాశి విశ్వేశ్వరుని పోలికలు కలిగి యున్నవి.గర్బగుడి లో వినాయకుడు,శివ లింగము,పార్వతి,సూర్యుడు,చంద్రుడు మరియు నంది దర్శనమిస్తారు.శివాలయం లో ద్వారపాలకుడి గా బాలాంజనేయుడు దక్షిణ దిశగా దర్శనమిస్తారు.ఆలయం ప్రహరి లోపట (శివాలయం వెనుక)పాము పుట్ట దర్శనమిస్తుంది.ఈ మధ్య కాలం లో ఇక్కడ భక్తులు సుబ్రమణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

క్షేత్రపాలకుడు – ఆంజనేయుడు :

శ్రీ బాలాజీ వెంకటేశ్వర దేవస్థానానికి క్షేత్ర పాలకుడిగా హనుమంతుడు దర్శనమిస్తారు.ఈ ఆలయం శివాలయానికి దక్షిణం లో మరియు వెంకటేశ్వరస్వామి దేవాలయానికి పడమర దిశలో ఉండును.ఈ దేవస్థానం భూమి మొత్తానికి ఈయన కాపలాదారుడు.ఇక్కడ 41 రోజు మండలము చేసిన వారికి చాల మంచి జరుగుతుంది అని భక్తుల విశ్వాసం.ఆయనే స్వయంగా కలలోకి వస్తారని అనేక మంది భక్తులు చెబుతుంటారు.ఈ దేవస్థానం లో మొత్తం నాలుగు హనుమాన్ విగ్రహాలు ఉంటాయి.

మైసమ్మ దేవాలయం :

ఈ దేవస్థానానికి 45 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.ఇక్కడ అందమైన తోట కూడా చూడవచ్చు.ఈ యొక్క తోట కి ప్రహరి నిర్మించబడినది.ఈ తోట లో మనకు మైసమ్మ దేవాలయం కనిపిస్తుంది.అమ్మవారిని అడగకుండా ,లేక ఎవరికీ చెప్పకుండా ఇక్కడ తోట లో నుంచి చిన్న వస్తువు కూడా తీసుకేల్లలేము అని గ్రామస్తులు చెబుతూ ఉంటారు.ఇక్కడ తోట లో అమ్మవారు రాత్రి వేళల్లో సంచరిస్తుంది అని గ్రామస్థులు చెబుతుంటారు.

ఆలయ ప్రాశాస్త్యత :

పూర్వికులు చెప్పిన ప్రకారము చాల మంది భక్తులు తమ అభిష్ట ప్రాప్తికి ఆలయ ప్రాంగణములో గల అరుగులపై ఏర్పాటు చేయబడిన వసతి ని వినియోగించుకొని మండలము రోజులు ఇక్కడ ఉండి అభిష్ట ప్రాప్తి పొందేవారని ప్రతీతి.

దీర్గ వ్యాధి గ్రస్తులు ఇక్కడి యజ్ఞ వాటికలు ఆలయ ప్రదక్షిణలు 11 పర్యాయములు చేయుట ద్వారా వ్యాధి నివారణ మరియు ఉపశమనము పొందేవారని ప్రతీతి.

ప్రస్తుత పరిస్థితి :

ఈ దేవస్థానం దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ పరిధి లో ఉన్నదీ.ఈ దేవాలయం యొక్క పూర్వీకులకు మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ కు మధ్య న్యాయస్థానం లో కేసు ఉన్నదీ.కోర్టు వ్యవహారం లో ఉన్నందున ఈ దేవస్థానం యొక్క దుస్థితి శిధిలావస్థ లో ఉన్నదీ.74 ఎకరాల భూమి , దేవాదాయ ధర్మాదాయ ఖాతా లో 20 లక్షలు రూపాయలు,దేవాదాయ ధర్మాదాయ శాఖ వసూలు చేస్తున్నట్టువంటి లక్షల రూపాయల శిస్తు ఉన్నా దేవుడు ఇక్కడ ధూప దీప నైవేద్యాలకు నోచుకోని పరిస్థితి.ఇక్కడ ఉన్న అయ్యగారు జీత బత్యాలు ఇచ్చిన ఇవ్వకపోయినా ఇక్కడ పూజ కార్యక్రమాలకు సిద్దుడయ్యాడు.రోజు ఉదయాన్నేవచ్చి 3-4 గంటల పాటు పూజ కార్యక్రమాలు నిర్వహించి వెళ్తారు.ప్రస్తుతం ఈ దేవస్థానం శిధిలావస్థకు చేరినది.హైదరాబాద్ నడి బొడ్డున ఇంత చారిత్రాత్మకమైన ఆలయం ఉన్నప్పటికీ ,ఈ ఆలయం వెలుగులోకి రాలేదు.ఈ దేవస్థానాన్ని ఎందరో ప్రజాప్రతినిధులు పునర్నిర్మాణానికి పూనుకున్నపటికి అది సాధ్య పడలేదు.2007 సంవత్సరం లో నవంబర్ లో అనేక సంవత్సరాల తరువాత భక్తుల సహకారం తో ఆలయ పూర్వీకుల సహకారం తో కొందరు గ్రామస్తులు ఇక్కడ బ్రహ్మొత్సవాలు నిర్వహించడం జరిగింది.ఆ తరువాత సంవత్సరం నుండి ఇక్కడ బ్రహ్మొత్సవాలు నిర్వహించాలన్నా,ఆర్ధిక పరిస్థితి సరిపడక ఆగిపోవాల్సి వచ్చింది.ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి వారి కళ్యాణం జరుగుతున్నపటికి,2013 మరియు 2014 నవంబర్ మాసం లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం మరియు శివ కళ్యాణం భక్తుల సహకారం తో గణంగా నిర్వహించడం జరిగింది.స్థానిక ఎం.ఎల్.ఎ అయిన శ్రీ.మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ,దేవాలయ పునర్నిర్మాణానికి కావాల్సిన అంచనా వ్యేయాన్ని ఇవ్వవలసింది గా దేవాదాయ ధర్మాదాయ శాఖ ని ఆదేశించారు.దానికి సంపంధించిన మ్యాపు మరియు 54 లక్షల అంచనా వ్యేయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు సిద్ధం చేసారు.ఈ యొక్క వ్యాయయం లో 20 శాతం(11 లక్షలు) నిధులు ప్రజల నుండి కడితే,మిగితా 80 శాతం(43 లక్షలు) నిధులు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు సమకూరుస్తారు.కాని దురదృష్టవశాత్తు మన తెలంగాణా ఏర్పడ్డాక,తెలంగాణా దేవాదాయ ధర్మాదాయ శాఖ లో నిధుల కొరత ఏర్పడినది.ఎవరో వస్తారు,ఏదో చేస్తారు అని ఇక్కడ భక్తులు ఎదురు చూడకుండా,ఎవరికీ తోచిన విధంగా వారు దేవస్తానికి వస్తువు రూపం లో సమర్పించుకుంటున్నారు.ఆలయం శిధిలం అవ్వకుండా తగిన చర్యలు చేపడుతున్నారు.దీనిలో భాగంగానే వెంకటేశ్వర గర్బగుడిలో అనేక మరమ్మతులు భక్తులు చేయించారు.శివాలయం కూలకుండా పైకప్పుకి,గర్బగుడికి మరమ్మతులు చేయించడం జరిగింది.క్షేత్రపలకుడైన హనుమంతుడి దేవాలయం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.భక్తులు ఎంత చేసినప్పటికీ ఇక్కడ మరమ్మతులు చేయవలసినవి చాలానే ఉన్నాయి.

ఆలయం లో ఈ క్రింద తెలిపినవి అత్యవసరం :

వెంకటేశ్వరా స్వామి దేవాలయం :

1) ఫ్లోరింగ్ – 4 లక్షల రూపాయలు

2) రూఫ్ – 2 లక్షల రూపాయలు

3) గర్బాలయ ద్వారాలు(2) – 3 లక్షలు

4) ద్వజస్తంబం – 1.5 లక్షలు

5) శిల్పాలు చేక్కించడానికి మరియు ఇతర మరమ్మత్తులకి – 4.50 లక్షలు

 

VEN_3730VEN_3692VEN_3696VEN_3699

VEN_3695   VEN_3700 VEN_3703 VEN_3708  VEN_3711 VEN_3714 VEN_3723   VEN_3733VEN_3730VEN_3710
IMAG4044IMAG3977IMAG4053IMAG4069

IMAG4054IMAG4060

 

IMAG4059IMAG4027

 

 

 

 

No new updates

₹16,000
raised of ₹1500000.00

This project will only be funded if at least ₹1500000 is raised by 05/31/2015
Project sponsor
Pratyusha G

  • No reward

    I don't want reward!

₹500.00 - No reward
Good
₹11000.00 - No reward
₹2000.00 - No reward
₹2000.00 - No reward
₹500.00 - No reward
testing

₹16,000
raised of ₹1500000.00

This project will only be funded if at least ₹1500000 is raised by 05/31/2015
Project sponsor
Pratyusha G

  • No reward

    I don't want reward!

testjir